News June 29, 2024
నేడు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు వెళ్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ గల ఆయన నివాసం నుంచి ఉదయం 7 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు. ఆలయం వద్ద జన సైనికులు భారీ ఏర్పాట్లు చేశారు.
Similar News
News November 14, 2025
రాజమండ్రిలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు

రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు ఆన్లైన్ రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.
News November 14, 2025
రాజమండ్రి నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాజమండ్రి నుంచి శబమరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సూపర్ లగ్జరీ బస్సును డీపీటీవో వై.సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, కాణిపాకం, అరుణాచలం మీదుగా శబరిమలకు బస్సులు వెళ్తాయన్నారు. 5రోజులు సాగే ఈ యాత్రకు ఈనెల 15, 17వ తేదీల్లో రాజమండ్రి నుంచి వెళ్తాయని చెప్పారు. డీఎం మాధవ్, పీఆర్వో శివకుమార్ పాల్గొన్నారు.
News November 14, 2025
తూ.గో జిల్లా రాజకీయాలపై చర్చ

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పటిష్ఠతకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ PAC సభ్యుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ తదితరులు పద్మనాభాన్ని కిర్లంపూడిలోని ఆయన నివాసంలో కలిశారు. జిల్లా రాజకీయాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.


