News March 29, 2025
నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News October 20, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, పీఎం దీపావళి విషెస్

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని ఆకాంక్షించారు. నిన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
News October 20, 2025
దీపావళి రోజున వీటిని చూస్తే అదృష్టమట

దీపావళి పర్వదినాన కొన్ని ప్రత్యేక సంకేతాలు అదృష్టాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. మహాలక్ష్మి వాహనమైన గుడ్లగూబను చూస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సంపద వృద్ధి చెందుతుందని అంటున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర పువ్వును చూస్తే ధనవృద్ధి ఉంటుందంటున్నారు. కాకి కనిపించడం పూర్వీకుల ఆశీస్సులతో సమానమట. వీటితో పాటు ఆవులు, బల్లులను చూడటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.
News October 20, 2025
NZB: పోయింది పోలీసు ప్రాణం.. తీసింది జనం

నిజామాబాద్‌లో పోలీసు ఆపదలో ఉన్నప్పుడు ప్రజలు సహాయం చేయకుండా చోద్యం చూసిన ఘటనకు సంబంధించి భావోద్వేగ కవితాత్మక పోస్ట్ వైరల్ అవుతోంది. ‘పోయింది పోలీసు ప్రాణం తీసింది జనం! జనం కోసం ప్రాణాలిచ్చే పోలీసు.. ప్రాణాలు పోతుంటే చోద్యం చూసిన జనం! అనే వ్యాఖ్యలతో మొదలైన ఈ సందేశం ప్రజల మనసులను కదిలిస్తోంది. ఏది ఏమైనా, ఒక పోలీసు ప్రాణం కోల్పోయిన తీరు, ప్రజల స్పందన పట్ల ఈ పోస్ట్ తీవ్ర నిరాశను వ్యక్తపరుస్తోంది.