News March 8, 2025

నేడు కొత్తగూడెం కోర్టులో లోక్ అదాలత్

image

ఈనెల 8వ తేదీన (శనివారం) కొత్తగూడెం కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి భానుమతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మీ మీద కానీ, మీకు తెలిసిన వారి మీద కానీ, మీ బంధువుల మీద కానీ ఎటువంటి కేసులు ఉన్నా రాజీ కుదుర్చుకోవడానికి మంచి అవకాశం ఉందని సూచించారు.

Similar News

News January 14, 2026

కాకినాడ: విషాద ‘భోగి’.. అగ్ని ప్రమాదంతో అగమ్యగోచరం..

image

రౌతులపూడి(M) సార్లంకపల్లెలో సంక్రాంతి సంబరాలు విషాదంలో మునిగిపోయాయి. సోమవారం జరిగిన <<18839258>>అగ్నిప్రమాదం<<>>లో ఇళ్లను కోల్పోయిన గిరిజన కుటుంబాలు, భోగి రోజున నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా, సర్వం కోల్పోయిన బాధలో మహిళలు ఏమి తోచని స్థితిలో ఉన్నారు. అందరూ సంబరాల్లో మునిగిపోగా, ఈ పల్లెలో మాత్రం బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి.

News January 14, 2026

త్వరలో రాష్ట్రంలో 10వేల పోస్టులకు నోటిఫికేషన్!

image

TG: రాష్ట్రంలో త్వరలో వైద్యారోగ్యశాఖలో 10వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.

News January 14, 2026

సింగపూర్ పాస్‌పోర్ట్ నం.1..! మన స్థానం ఎంత..?

image

మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ లిస్ట్-2026లో ఇండియా 80వ స్థానంలో(2025లో 85) నిలిచింది. మన PPతో వీసా లేకుండా 55 దేశాలకు వెళ్లొచ్చని హెన్లీ ఇండెక్స్ తెలిపింది. 192 కంట్రీస్ యాక్సెస్‌తో సింగపూర్ No.1.. 188 యాక్సెస్‌తో జపాన్, సౌత్ కొరియా No.2 ప్లేసెస్‌లో ఉన్నాయి. డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, లగ్జెంబర్గ్ 3లో నిలిచాయి. లిస్ట్‌లో USA 10, PAK 98ర్యాంకు పొందగా, AFG 101తో చివరన ఉంది.