News January 30, 2025
నేడు కొవ్వూరు డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. 30వ తేదీ కొవ్వూరు పట్టణ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిగ్రీ కాలేజ్ సంయుక్తంగా నిర్వహించే మినీ జాబ్ మేళా కరపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జాబ్ మేళా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని యువత వినియోగించుకోవాలన్నారు.
Similar News
News February 14, 2025
దివాన్ చెరువు: లారీ డ్రైవర్ పై దుండగులు దాడి

ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామానికి చెందిన లారీడ్రైవర్ చంద్రుడు దివాన్‌చెరువు పండ్లమార్కెట్ దాటిన తరువాత రోడ్డుపక్కన లారీని ఆపాడు. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి డ్రైవర్‌పై దాడిచేసి రూ.7,800 నగదు, రెండుసెల్ ఫోన్లు లాక్కుని పారిపోయారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 14, 2025
రాజమండ్రి: సీఐడీ డీఎస్పీ అనుమానాస్పద మృతి

రాజమండ్రిలో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీగా విధులు నిర్వర్తించే నాగరాజు గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాజమండ్రిలోని గాంధీపురం పరిధిలోని ఓ గుడివద్ద మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూస్తే డీఎస్పీగా తెలింది. 1995 బ్యాచ్‌కి చెందినవారు. సీఐడీ విభాగంలో నాగరాజు రాజమండ్రిలో పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆస్పరి.
News February 13, 2025
చాగల్లు: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన దుర్గాభవాని(35), వివాహిత కుమార్తె కుమారుడు సంతానం ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్థాపానికి గురై గురువారం ఆమె పిల్లలతో మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోంది. చికిత్స నిమిత్తం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సై నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.