News February 16, 2025
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి కూసుమంచి, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, మధిర, ఖమ్మం, ముదిగొండ మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు.
Similar News
News March 20, 2025
ఖమ్మం: మహా ప్రస్థానం.. మహాద్భుతంగా ఉండాలి: తుమ్మల

మనిషి మృతి చెందిన తర్వాత చివరి మజిలీ మహా “ప్రస్థానం” మహా అద్భుతంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల ఆదేశించారు. బుధవారం హైదరాబాదులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, సత్తుపల్లిలో మోడల్ వైకుంఠ దామాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అగస్త్య, సత్తుపల్లి కమిషనర్ నరసింహ ఆదేశించారు.
News March 20, 2025
ఖమ్మం: పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

మంచి మనస్సుతో అధికారులు నాణ్యతతో పనులు పూర్తి చేసి బాలల సదనం సుందరీకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్, నగరంలోని బాల సదనం భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల సదనంలో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులు, పిల్లలకు ఆహ్లాదం కోసం కల్పించాల్సిన ఆట పరికరాలు, గ్రీనరీ, వాల్ పెయింట్, అదనపు వసతుల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
News March 20, 2025
ఖమ్మం: పదో తరగతి పరీక్షలకు వేళాయే!

ఖమ్మం జిల్లాలో టెన్త్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 97 పరీక్ష కేంద్రాల్లో 16,788 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. CC కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ శర్మ చెప్పారు. 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 97 సిట్టింగ్ స్క్వాడ్స్, 97 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 98 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1595 మందిని ఇన్విజిలేటర్లుగా విధులు కేటాయించారు.