News January 24, 2025
నేడు గద్వాలకు మల్లు రవి

గద్వాల జిల్లాకు నేడు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి రానున్నట్లు కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా ఛైర్మన్ నల్లారెడ్డి తెలిపారు. జిల్లాలో అమృత్ 2.0 తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మల్లు రవితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు.
Similar News
News November 12, 2025
సిరిసిల్ల: ‘రైతు బజార్లోనే విక్రయాలు జరగాలి’

సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్ను బుధవారం పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, పాల్గొన్నారు.
News November 12, 2025
SRCL: ‘కొత్తచెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి’

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఇన్చార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. చెరువు కట్టపైకి వెళ్లి, పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు.
News November 12, 2025
సికింద్రాబాద్లోని NIEPMDలో ఉద్యోగాలు

సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<


