News January 24, 2025
నేడు గద్వాలకు మల్లు రవి

గద్వాల జిల్లాకు నేడు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి రానున్నట్లు కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా ఛైర్మన్ నల్లారెడ్డి తెలిపారు. జిల్లాలో అమృత్ 2.0 తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మల్లు రవితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు.
Similar News
News February 7, 2025
BCల జనాభా పెరిగింది: రేవంత్

TG: తాము నిర్వహించిన కులగణనలో BCల జనాభా ఐదున్నర శాతం పెరిగిందని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో CM రేవంత్ వెల్లడించారు. బీసీల జనాభా పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని చెప్పారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అటు PCC కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వస్తుందన్నారు. ఇక తాను రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని CM చెప్పారు.
News February 7, 2025
అనకాపల్లి: టీచర్‌పై పోక్సో కేసు నమోదు

బుచ్చయ్యపేట వడ్డాది ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం తెలిపారు. అనంతరం నిందితుడిని చోడవరం కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజులు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
News February 7, 2025
8 నెలల్లో రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు: TDP

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రంలో చాలా కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చినట్లు టీడీపీ ట్వీట్ చేసింది. 34 ప్రాజెక్టుల ద్వారా రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేసింది. త్వరలో ఏర్పాటు కానున్న కంపెనీల్లో 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పూర్తి వివరాలను వెల్లడించింది.