News November 10, 2024

నేడు గుంటూరుకి రానున్న డిప్యూటీ సీఎం 

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరుకు రానున్నారు. నగరంలోని అరణ్య భవన్లో ఉదయం 11 గంటలకు అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని అటవీ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం రాక కోసం ఏర్పాట్లు చేపట్టారు. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గుంటూరు నగరానికి రానున్నారు. 

Similar News

News November 28, 2025

గుంటూరులో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మొత్తం 15 వినతులు స్వీకరించి, వ్యక్తిగత, సర్వీసు, బదిలీ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం పోలీస్ శాఖకు ప్రాధాన్యం అని, భయపడకుండా సమస్యలను నేరుగా తెలియజేయాలని ఆయన సూచించారు.

News November 28, 2025

దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

image

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో 140 బస్తాల పసుపు విక్రయాలు జరిగాయి. ఈ వేలంలో క్వింటాల్ పసుపు ధర రూ.12,900 పలికింది. కొమ్ముల రకం పసుపు కనిష్ఠ, గరిష్ఠ, మోడల్ ధరలు రూ.12,900గా ఒకే ధర పలకగా, కాయ రకం పసుపు కూడా అదే ధర పలికినట్లు యార్డు అధికారులు తెలిపారు.

News November 28, 2025

ఖేలో ఇండియా క్రీడల్లో ANU విద్యార్థికి మూడో స్థానం

image

రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) విద్యార్థి ఎం. అశోక్ కుమార్ శుక్రవారం మూడో స్థానం సాధించారు. వెయిట్‌ లిఫ్టింగ్ 94 కేజీల కేటగిరీలో ఆయన కాంస్యం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్‌ను వర్సిటీ వీసీ గంగాధరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.