News September 11, 2024

నేడు గుంటూరుకు జగన్ రాక

image

వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరులో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు గుంటూరు సబ్ జైలుకు చేరుకుంటారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌తో ములాఖత్ అవుతారు. 11.30 గంటలకు జైలు నుంచి బయల్దేరి ఎస్వీఎన్ కాలనీలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డిని పరామర్శిస్తారు. 11.55కి ఎస్వీఎన్ కాలనీ నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

Similar News

News December 23, 2025

GNT: డీజీపీ కమెండేషన్ డిస్క్‌లకు ఎంపికైన పోలీస్ అధికారులు

image

ఏపీ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన పోలీస్ అధికారులకు 2025 సంవత్సరానికి గాను డీజీపీ కమెండేషన్ డిస్క్‌లను ప్రకటించారు. ఈ అవార్డులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ విభాగాల్లో అందజేస్తారు. సిల్వర్ డిస్క్ విభాగంలో ASP(అడ్మిన్) జి. వెంకట రమణ మూర్తి, తాడికొండ సీఐ కె. వాసు, చేబ్రోలు పోలీస్ ఏఎస్సై–(2260) యు. శ్రీనివాసరావు ఎంపికయ్యారు. అటు బ్రాంజ్ మెడల్ విభాగంలో మరో 20 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు.

News December 22, 2025

వక్ఫ్ భూముల్లో హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో వక్ఫ్ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు ఏర్పాటుకు వక్ఫ్ బోర్డు, సర్వే, రెవిన్యూ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ వక్ఫ్ భూములను నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం సర్వే జరిగేలా చూడాలన్నారు.

News December 22, 2025

వినియోగదారుల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

జాతీయ వినియోగదారుల వారోత్సవాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. ఆహార పదార్థాల ప్యాకింగ్, వివిధ రంగుల్లో ఉండే గుర్తులను ఎలా గమనించాలి, ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే వాటిపై అవగాహన కల్పించాలని తెలిపారు.