News September 7, 2024

నేడు గుంటూరు జిల్లాకు వర్షసూచన

image

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న కృష్ణా జిల్లాల సైతం నేడు అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Similar News

News October 14, 2024

యువగళం పాదయాత్రలోని మరో హామీని నెరవేర్చా: లోకేశ్

image

యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చినట్లు మంత్రి లోకేశ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు. వారి సెంటిమెంట్‌ను గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు లోకేశ్ తెలియజేశారు.

News October 13, 2024

చిలకలూరిపేటలో జాబ్‌మేళా..1000 పైగా ఉద్యోగాలు

image

చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడులోని యువత కోసం ఈనెల 19వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. 30కి పైగా కంపెనీలు, 1000కి పైగా జాబ్‌ ఆఫర్లతో ఈ జాబ్‌ మేళా జరుగుతుందన్నారు. 2016-2024 మధ్య 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఎంటెక్‌ చేసిన వారంతా అర్హులేనని అన్నారు. Shareit

News October 13, 2024

గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

image

డీఎస్సీ ఉచిత శిక్షణకు అర్హులైన SC,ST అభ్యర్థుల నుంచి ఏపీ సాంఘిక సంక్షేమశాఖ అమరావతి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత బోధన, భోజన, వసతి సౌకర్యాలతో పాటు 3 నెలల ఉచిత శిక్షణ పొందుటకు అవకాశం కల్పించారు. http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని, అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2.50లక్షల లోపు ఉండాలన్నారు.