News January 17, 2025
నేడు గుడిమల్కాపూర్ మర్కెట్ కమిటీ ప్రమాణం

గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈరోజు జరుగనుంది. ఛైర్మన్గా మల్లేశ్, వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, తుమ్మల నాగేశ్వర్రావు తదితరులు హాజరుకానున్నారు.
Similar News
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
HYD: వైద్య సేవల బలోపేతంపై మంత్రి సమీక్ష

ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రులలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి దామోదర రాజనరసింహ ఎస్ఆర్ నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పర్యటించి 2, 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని TGMSIDC ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

సినీ కార్మికులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య బీమా కల్పించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సహాయం చేస్తామన్నారు. HYDను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారు. ‘గద్దర్ అవార్డులు’ కొనసాగిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో, వారు కృతజ్ఞతలు తెలిపారు.