News May 3, 2024

నేడు గోదావరిఖనికి మాజీ CM KCR

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మాజీ CM KCR ఈరోజు సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారని BRS అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజల్లో BRSకు వస్తున్న ఆదరణ ఓర్వలేక రోడ్డు షోను ఆపేందుకు అధికార పార్టీ పాలకులు దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతం చేయాలన్నారు.

Similar News

News January 3, 2025

సిరిసిల్ల: ఖేల్ రత్న, అర్జున అవార్డుల గ్రహీతలకు కేటీఆర్ విషెస్

image

ఖేల్ రత్న, అర్జున అవార్డుల‌కు ఎంపికైన‌ క్రీడాకారుల‌కు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ పారా అథ్లెట్ దీప్తి జివాంజి, ఏపీకి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజి.. అర్జున అవార్డులకు ఎంపికై తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని దేశం దశదిశలా వ్యాపింపజేసినందుకు మీకు శుభాకాంక్షలు అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. మరెన్నో శిఖరాలను అధిరోహించాలని కోరారు.

News January 3, 2025

సిరిసిల్ల: ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం వాసి జక్కుల అనూష(18) గురువారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అనూష తంగళ్లపల్లి మండలం బద్దనపెల్లిలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అనూష తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. 3 రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

News January 3, 2025

ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.96,791 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.51,713, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.36,570, అన్నదానం రూ.8,508 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.