News April 10, 2024
నేడు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ పర్యటన

AP: TDP అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ప.గో జిల్లా తణుకులో సా.4గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తూ.గో జిల్లా నిడదవోలులో రాత్రి 7 గంటలకు నిర్వహించే సభలో రాష్ట్ర BJP చీఫ్ పురందీశ్వరితో కలిసి పాల్గొననున్నారు. రేపు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. సా.4 గంటలకు అంబాజీపేట సభలో, రాత్రి 7కి అమలాపురం సభలో ప్రసంగిస్తారు.
Similar News
News November 23, 2025
మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. * మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.
News November 23, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న MovieRulz

పైరసీ మాఫియా టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను అప్లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.
News November 23, 2025
నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్నారు.


