News March 31, 2025
నేడు చింతూరులో అత్యధిక ఉష్ణోగ్రత: APSDMA

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని APSDMA అంచనా వేసింది. చింతూరులో అత్యధికంగా 45.3 డిగ్రీలు, కూనవరంలో 43, నెల్లిపాక 41.2, వరరామచంద్రాపురం 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అడ్డతీగల, అనంతగిరి, చింతపల్లి, గంగవరం, గూడెంకొత్తవీధి, మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.
Similar News
News July 6, 2025
ప్రచార రథం ప్రారంభమయ్యేది అప్పుడే

జులై 9న మ.2 గంటలకు సింహాచలం గిరిప్రదక్షిణ ప్రచారరథం ప్రారంభమవుతుందని ఈవో త్రినాథరావు కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వద్ద అశోక్ గజపతి చేతుల మీదుగా ప్రచారరథం ప్రారంభమవుతుందన్నారు. ఆరోజు రాత్రి 11 గంటలకు రథం ఆలయానికి చేరుకుంటుందని, మరుసటి రోజు ఉ.5 నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.10వ తేదీ సాయంత్రం 7వరకు దర్శనాలు ఉంటాయన్నారు.
News July 6, 2025
ఈనెల 10న మెగా పేరెంట్ మీట్: కలెక్టర్

జిల్లాలని అన్ని పాఠశాలల్లో ఈనెల 10న మెగా పేరెంట్ మీట్ నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న 1385 పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో హాజరవ్వాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో అతిథిలకు స్కూల్లోనే భోజనం అందించాలన్నారు 212 జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు.
News July 6, 2025
ఆ సమయంలో 9 రోజులు అన్నం ముట్టను: హీరోయిన్

తాను ఏడాదికి రెండు సార్లు ఉపవాసం ఉంటానని హీరోయిన్ నర్గీస్ ఫక్రీ తెలిపారు. ఆ సమయంలో 9 రోజులపాటు ఏమీ తిననని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఉపవాసం చేసినన్ని రోజులు నీళ్లు తాగే బతుకుతా. ఫాస్టింగ్ అయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కానీ ముఖంలో కాస్త గ్లో ఉంటుంది. ఉపవాసం అయిపోయాక హై ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా నర్గీస్ ఇటీవల విడుదలైన ‘హౌస్‌ఫుల్ 5‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.