News September 20, 2024

నేడు జగన్‌ను కలవనున్న MLA తాటిపర్తి

image

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ శుక్రవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడిన నేపథ్యంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి కూడా పార్టీని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేకు పిలుపొచ్చింది. దీంతో ఆయన ఇవాళ జగన్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

Similar News

News October 9, 2024

ఒంగోలులో ప్రాథ‌మిక ఆహార ప‌రీక్ష‌ల ప్రయోగశాల: మంత్రి స‌త్య‌కుమార్

image

రాష్ట్రంలో ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల్ని మ‌రింత‌ పెంపొందించ‌డానికి భార‌త ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల సంస్థతో, ఏపీ ప్ర‌భుత్వం రూ.88.41 కోట్ల‌తో మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలో ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌తో కలిసి ఒప్పందప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. ఒప్పందాలలో భాగంగా ఒంగోలుల‌లో ప్రాథ‌మిక ఆహార ప‌రీక్ష‌ల ప్రయోగశాల రూ. 7.5 కోట్ల‌తో నెల‌కొల్ప‌నున్నాట్లు మంత్రి తెలిపారు.

News October 9, 2024

ప్రకాశం: రైతు బజార్ కేంద్రాల్లో టమాటాలు విక్రయాలు

image

ప్రకాశం జిల్లాలోని అన్ని రైతు బజార్ కేంద్రాలలో నిన్నటి నుంచి రాయితీపై టమాటాలు అందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒక కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నామన్నారు. ఒక కుటుంబానికి రెండు కిలోలు మాత్రమే అందిస్తామని, తమ వెంట ఆధార్ జిరాక్స్ లేదా రేషన్ కార్డు జిరాక్స్‌ను తమ వెంట తీసుకుని రావాలని కోరారు. అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలన్నారు.

News October 8, 2024

ప్రకాశం జిల్లా అభివృద్దికి కృషి చేస్తా: MP మాగుంట

image

రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మంగళవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పనలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా జిల్లాను ఏ విధంగా అభివృద్ది చేసుకోవాలన్న విషయంపై ప్రతిఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. అలాగే సి.ఎస్.ఆర్ నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.