News March 16, 2025
నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్పూర్లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.
Similar News
News March 17, 2025
మాకవరపాలెం: బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

మాకవరపాలెం మండలం చామంతిపురంలో ఒక యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్(17) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేశారు.
News March 17, 2025
కామారెడ్డి: భార్యని చంపిన భర్త

అనుమానంతో భార్యని చంపాడో భర్త. ఈ ఘటన HYDలోని అంబర్పేట్లో జరిగింది. పోలీసుల వివరాలు.. కామారెడ్డి (D) దోమకొండ (M) అంబర్పేటకు చెందిన నవీన్కు బీబీపేట్(M)కు చెందిన రేఖ(27)తో పెళ్లైంది. వీరు HYDలో అంబర్పేట్లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన నవీన్ భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈనెల 10న పెట్రోల్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రేఖ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News March 17, 2025
పల్నాడు జిల్లాలో పలువురు పోలిస్ సిబ్బంది బదిలీలు

పల్నాడు జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని బదిలీలు చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలిస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే విధంగా పలువురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీలు చేస్తూ, పోస్టింగ్స్ ఇచ్చారు.