News March 16, 2025

నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్‌పూర్లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.

Similar News

News April 18, 2025

క్రికెటర్లు అసభ్య ఫొటోలు పంపేవారు: అనయా

image

తనకు కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫొటోలు పంపేవారని టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ కూతురు అనయా తెలిపారు. ఓ సీనియర్ క్రికెటర్ తనతో బెడ్ పంచుకోవాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. తోటివారితో ఎన్నో అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కాగా బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకుని అనయాగా మారారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.

News April 18, 2025

వరంగల్‌: భద్రకాళి చెరువులోని మట్టి కావాలా?

image

వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీతలో భాగంగా నల్లమట్టి కావాల్సిన వారు నక్కలగుట్ట ఇరిగేషన్ సర్కిల్-2 కార్యాలయంలో సంప్రదించాలని ఈఈ శంకర్ తెలిపారు. ఒక క్యూబిక్ మీటరు మట్టికి రూ.71.83 డీడీ తీసి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం సహాయ కేంద్రం నంబర్ 94406 38401ను సంప్రదించాలన్నారు. నల్లమట్టి పంట పొలాలకు ఎరువులా ఉపయోగపడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 18, 2025

చిత్తూరు: ఒకటవ తరగతికి ఆన్‌లైన్ అడ్మిషన్లు

image

ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి సూచించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్లకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేయాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.

error: Content is protected !!