News March 29, 2024
నేడు జిల్లాకు ఎంపీ రఘురామకృష్ణరాజు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు జిల్లాకు రానున్నట్లు ఎంపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పెదఅమిరంలో ఉన్న ఆయన కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు, ఆయన అభిమానులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.
Similar News
News January 5, 2026
ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్ను సందర్శించిన డిప్యూటీ స్పీకర్

ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్ను సోమవారం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు సందర్శించారు.
హాస్పిటల్ పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో వాటిని తొలగించి ఉద్యానవనంలా తయారు చేయాలని సిబ్బందికి చెప్పారు. రోగులకు అందతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
News January 5, 2026
గ్రామాభివృద్ధికి కూటమి కృషి చేస్తుంది: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉండి నియోజవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో సీసీ రోడ్డుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ వనమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బద్రి, పాసర్ల శ్రీనివాస్, నాగేశ్వరావు, పండు, కూటమి నాయకులు ఉన్నారు.
News January 5, 2026
పాలకొల్లు: ఇంటికి వెళ్లడానికి 4 గంటలు ఉందనగా..

పాలకొల్లుకు చెందిన దంపతులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. క్రిస్మస్ సెలవులకు స్వగ్రామం వచ్చి, తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరడానికి మరో 4 గంటల సమయం ఉందనగా ఈ విషాదం జరిగింది. మృతులు కొటికలపూడి రాజమోహన్ రావు కుమారుడు, కోడలుగా గుర్తించారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదని వచ్చి చూసి వెళ్తుండగా మృత్యువాత పడటంతో పాలకొల్లులో విషాద ఛాయలు అలముకున్నాయి.


