News May 8, 2024
నేడు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా వస్తున్నారు. ఆర్మూర్‌లో సాయంత్రం 5 గంటలకు, నిజామాబాద్ నెహ్రూపార్క్ చౌరస్తాలో రాత్రి 7గంటలకు నిర్వహించే కార్నర్ సమావేశాల్లో ప్రసంగిస్తారు. అంతకు ముందు గోల్హమ్మన్ చౌరస్తా నుంచి ఆర్యసమాజ్, పెద్దబజార్, ఆజాం రోడ్డు, పోస్టాఫీస్ మీదుగా నెహ్రూపార్క్ వరకు రోడ్డు షో ఉంటుంది. సీఎం ఇప్పటికే రెండు సార్లు పర్యటించగా ఇది మూడోది.
Similar News
News January 18, 2025
నిజాంసాగర్: నేడు జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్ష
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం నిర్వహించే 2025 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు శనివారం 10:30 వరకు పాఠశాలకు చేరుకోవాలని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ మనుజే యోహనన్ తెలిపారు. 11 గంటల తర్వాత లోపలికి అనుమతించమని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
News January 18, 2025
నిజామాబాద్: ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు రాక
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిజామాబాద్ రానున్నారు. ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. తదుపరి గోల్ హనుమాన్ వద్ద మున్సిపల్ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించి రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు.
News January 17, 2025
నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఎంపీ అరవింద్
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ను నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాలను వివరించాను. అదేవిధంగా కొత్తగా ప్రారంభించబడిన జాతీయ పసుపు బోర్డు పట్ల రాష్ట్రంలో జరుగుతున్న ఆనందోత్సాహాలు వారికి వివరించారు.