News March 30, 2025

నేడు జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే!

image

నేడు హుజూర్‌‌నగర్‌కు CM రేవంత్ రెడ్డి రానున్న విషయం తెలిసిందే. కాగా, షెడ్యూల్ ఇలా ఉంది.
☞5:00PM బేగంపేట ఏయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో రాక
☞5:45PM హుజూర్‌నగర్ రామస్వామిగుట్ట వద్ద ల్యాండ్
☞5:45PM-6:05PM స్థానికంగా 2000 సింగిల్ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలన
☞6:15PM హుజూర్‌నగర్‌ బహిరంగ సభలో ప్రసంగం
☞6:15PM-7:30PM వరకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం
☞7:30PM తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు ప్రయాణం

Similar News

News October 20, 2025

కోరుట్ల నుంచి అరుణాచలానికి SPECIAL BUS

image

కోరుట్ల నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. నవంబర్ 3న సాయంత్రం 4 గంటలకు కోరుట్ల నుంచి బస్ బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 5న అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం బయలుదేరి 6న మహానంది, జోగులాంబ దర్శనాల తర్వాత తిరిగి కోరుట్ల వస్తుందన్నారు. ఛార్జి పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.4,180 ఉంటుందన్నారు.

News October 20, 2025

సిరిసిల్ల: పారా అథ్లెట్ అర్చనకు KTR ఆసరా..!

image

పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. సిరిసిల్ల పరిధిలోని చంద్రంపేటకు చెందిన అర్చన, ఆమె కుటుంబం హైదరాబాదులోని కేటీఆర్ నివాసంలో ఆయనను ఆదివారం కలిశారు. డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్‌లో దేశం నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచే అర్చన ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీలంక వెళ్లేందుకు KTR అర్చనకు ఆర్థిక సాయం అందజేశారు.

News October 20, 2025

కామారెడ్డి: ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

image

కామారెడ్డిలోని కలెక్టరేట్ ఆవరణలో ఈ నెల 22వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజని కిరణ్ తెలిపారు. ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన కోరారు. అభ్యర్థులు 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు.