News June 24, 2024
నేడు జిల్లా ఎంపీల ప్రమాణ స్వీకారం

18వ లోక్‌సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా జిల్లా ఎంపీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథిలతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. వీరిలో అంబికా తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికవగా పార్థసారథి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News October 20, 2025
ప్రభుత్వం డీఏ జీఓను సవరించాలి: విజయ్

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీచేసిన 60, 61 జీఓలు అసంబద్ధంగా ఉంటూ ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని, వెంటనే జీవోలను సవరించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. డీఏ అరియర్స్ పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని అనడం సరైనది కాదన్నారు.
News October 20, 2025
వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా రాధ

గుత్తి ఆర్ఎస్‌లోని ఎస్ఎస్ పల్లికి చెందిన చంద్రగిరి రాధను వైసీపీ మహిళా విభాగం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాధ ఎంపిక పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాధ అన్నారు.
News October 19, 2025
పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి: ఎస్పీ

అనంతపురం జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ జగదీశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మీ జీవితాలలో చీకట్లను పారదోలి మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణసంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.