News October 20, 2024
నేడు జిల్లా జూనియర్స్ ఖోఖో జట్ల ఎంపిక
జిల్లా జూనియర్స్ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపికలు ఆదివారం జరగనున్నాయని జిల్లా ఖోఖో అసోసియేషన్ శ్రీకాకుళం అధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదాన వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని పేర్కొన్నారు. క్రీడాకారుల ఇండెక్స్ వయస్సు, బరువు, ఎత్తు కలిపి మొత్తం 250పాయింట్లు ఉండాలన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 25న రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు.
Similar News
News November 11, 2024
SKLM: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్
శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35 వేల మందికిపైగా చదువుతున్నారు. అక్టోబర్ 21 నుంచి చెల్లింపు మొదలవ్వగా వీరంతా ఈ నెల 11వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
News November 11, 2024
భోగాపురం ఎయిర్ పోర్టును 2026కి పూర్తి: కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే భోగాపురం ఎయిర్ పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లడించారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం 6వ సారి ఆయన ఏర్పోర్టు పనులను పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
News November 10, 2024
శ్రీకాకుళం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డులు వీరే..!
లావేరు మండలం గోవిందపురం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుంటముక్కల శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే బూర్జ మండలంలోని ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కావడం గమనార్హం.