News October 18, 2024
నేడు జిల్లా నేతలతో సీఎం సమావేశం
కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో నేడు సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేయనున్నారు. అలాగే జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే నేతలు విజయవాడ చేరుకున్నారు.
Similar News
News November 11, 2024
ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి: నంద్యాల ఎస్పీ
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 85 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీ అధికారులకు సూచించారు.
News November 11, 2024
విషాదం.. మహానంది కోనేటి వద్ద మూర్చకు గురైన బాలుడి మృతి
మహానంది క్షేత్రంలోని కోనేరు వద్ద స్నానమాచరిస్తూ మూర్చకు గురైన బాలుడు మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. సోమవారం తాడిపత్రికి చెందిన భక్తులు స్నానమాచరిస్తుండగా మూర్చకు గురికావడంతో 108 వాహనంలో నంద్యాలకు తరలించారు. మార్గమధ్యంలో తాడిపత్రి మండలం సేనగల గూడూరుకు చెందిన 9 ఏళ్ల చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగారు.
News November 11, 2024
యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రవికుమార్, నవీన్ పాటి
యూటీఎఫ్ కర్నూలు జిల్లా నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రవికుమార్, నవీన్ పాటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గూడూరులో జరిగిన జిల్లా స్వర్ణోత్సవ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా నవీన్ పాటి, ఆర్థిక కార్యదర్శిగా యెహోషువ, సహాధ్యక్షులుగా హేమంత్ కుమార్, జీవిత, గౌరవాధ్యక్షుడిగా దావీదు ఎన్నికయ్యారు.