News December 16, 2024

నేడు జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ సేవలు: GNT కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లాలోని అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు చేయదలచిన ప్రజలు విషయాన్ని గమనించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువచేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Similar News

News January 25, 2025

మంగళగిరి: ఏపీఎస్పీ కానిస్టేబుల్ అదృశ్యం

image

మంగళగిరి పరిధిలోని ఏపీఎస్పీ 6వబెటాలియన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శనివారం లిఖితపూర్వకంగా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.

News January 24, 2025

నిఘా పెట్టి.. నేరాలు నియంత్రణ చేయాలి: ఎస్పీ

image

గుంటూరు జిల్లా నేర విభాగం పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. నేరాల దర్యాప్తు, చోరీకి గురైన సొమ్ము రికవరీ తీరు తదితర అంశాల గురించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా తగిన నిఘా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జైలు నుంచి వచ్చిన నేరస్తులు, దొంగల కదలికలపై నిఘా పెట్టి నేరాలు జరుగకముందే వాటిని కట్టడి చేయాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ సుప్రజ ఉన్నారు.

News January 24, 2025

 గుంటూరు: మూడు రోజులు పోలీసు కస్టడీకి తులసి బాబు

image

RRRను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబును మూడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశించారు. నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో ఒంగోలు ఎస్పీ విచారణాధికారి. ఐదు రోజుల కస్టడీకి పిటీషన్ దాఖలు చేయగా, తులసి తరఫు న్యాయవాదులు అందుకు నిరాకరించారు. కేసు పూర్వపరాలు, వాదోపవాదాల అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతించారు.