News April 6, 2024

నేడు డయల్ యువర్ యూనివర్సిటీ కార్యక్రమం రద్దు

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రతి నెలా మొదటి శనివారం నిర్వహిస్తున్న డయల్ యువర్ యూనివర్సిటీ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు రిజిస్టర్ పి.సుజాత తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ నుంచి శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమం రద్దు చేశారు. ఎన్నికల కోడ్ ముగిశాక ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అని ప్రకటనలో పేర్కొన్నారు. 

Similar News

News December 16, 2025

శ్రీకాకుళం: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

image

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్‌లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.

News December 16, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 46 అర్జీలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు విన్నారు. మొత్తం 46 అర్జీలు స్వీకరించామన్నారు.