News January 6, 2025
నేడు తాడేపల్లి చేరుకోనున్న మాజీ సీఎం జగన్

బెంగుళూరు వెళ్లిన మాజీ సీఎం జగన్ సోమవారం తిరిగి రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 5.20కి ఆయన బెంగుళూరు నుంచి గన్నవరం చేరుకుంటారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. సాయంత్రం 5.30కి గన్నవరంలో రోడ్డు మార్గాన బయలుదేరి 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి మాజీ సీఎం జగన్ చేరుకుంటారని ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.
Similar News
News January 3, 2026
గుడివాడ ఫ్లైఓవర్‌కు రైల్వే అనుమతులు.. కానీ.!

గుడివాడలోని రైల్వేగేట్లపై రూ.330కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల పనులకు అనుమతులు లభించాయి. ఇప్పటికే 70% పనులు పూర్తి కాగా, భూసేకరణ చెల్లింపులు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులను రైల్వే అధికారులు నేరుగా పర్యవేక్షించాల్సి ఉంది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ దృష్ట్యా ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో 6నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరికి ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
News January 2, 2026
పెడన: యువకుడి సూసైడ్

పెడన మండలం చెన్నూరు గ్రామంలో యర్రంశెట్టి వెంకటేష్ (28) తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పెడన ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ప్రశంసించిన చంద్రబాబు

కలెక్టర్ డీకే బాలాజీని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.


