News September 27, 2024
నేడు తాడేపల్లి నుంచి తిరుమలకు జగన్.. షెడ్యూల్ ఇదే.!

వైసీపీ అధినేత YS జగన్ శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి 4.50 గంటలకు రేణిగుంటకు విమానంలో చేరుకుంటారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకొని, 28వ తేదీన స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొంది. అనంతరం బెంగుళూరులోని నివాసానికి జగన్ చేరుకుంటారని సమాచారం వెలువడింది.
Similar News
News January 5, 2026
తెనాలి సబ్ కలెక్టర్ గ్రీవెన్స్‌కు 7 ఫిర్యాదులు

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 7 ఫిర్యాదులు వచ్చాయి. సబ్ కలెక్టర్ సంజనా సింహ వేరే అధికారిక కార్యక్రమానికి వెళ్లడంతో కార్యాలయ అధికారులే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 1, మున్సిపాలిటీ 2, దేవాదాయ శాఖ 1, పంచాయతీ రాజ్ విభాగానికి 3 అర్జీలు చొప్పున మొత్తం 7 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని ఆయా విభాగాలకు పంపి పరిష్కరిస్తామని తెలియజేశారు.
News January 5, 2026
GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10:35 గంటలకు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 10:45 గంటలకు జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు సచివాలయానికి వస్తారు. సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీజీఎస్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
News January 5, 2026
నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు రాక

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు రానున్నారు. ఉదయం 10:25 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 ని.లకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.


