News September 28, 2024
నేడు తిరుపతికి సిట్ బృందం రాక

తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్రంలో దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం నియమించిన సిట్ బృందం నేడు తిరుపతికి రానుంది. ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలోని ఈ బృందం లడ్డూ కల్తీపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టనుంది. ఇందులో భాగంగా సిట్ బృందం మొదటి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదయిన కేసును తమ పరిధిలోకి తీసుకోనుంది.
Similar News
News February 27, 2026
CTR: రూ.కోట్లు కొల్లగొట్టి.. ప్రజలకు కుచ్చుటోపి పెట్టి!

చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. మొన్న పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 27, 2026
చిత్తూరు: ‘తక్షణమే రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాలి’

కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం మైక్రో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. అర్హత కలిగిన రైతులందరికీ తక్షణమే సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వాటా చెల్లించిన వారికి వెంటనే మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని ఆయన సూచించారు. డ్రిప్ పరికరాలు మంజూరైన 1386 మందికి మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. మెటీరియల్ అందుకున్న రైతులకు ఇన్స్టాలేషన్ చేయాలన్నారు.
News February 27, 2026
74% మ్యాపింగ్ పూర్తి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో 74% ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి అయినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆరు నెలల్లో ఓట్ల జాబితాలో తొలగించిన వివరాలను రాజకీయ పార్టీలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.


