News October 7, 2024
నేడు దుర్గమ్మ ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?

దసరా శరన్నవరాత్రులలో ఐదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహా చండీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించనున్నారు. అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటని, చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని పండితులు తెలిపారు. శ్రీ చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలలో ప్రస్తావించబడిందన్నారు.
Similar News
News December 8, 2025
మచిలీపట్నం: అనాధ పిల్లలకు ఆరోగ్య కార్డుల పంపిణీ

అనాధ పిల్లలకు ఆరోగ్య పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లో ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాధ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాధ పిల్లలకు కలెక్టర్ చేతుల మీదుగా ఆరోగ్య కార్డులు అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల మాదిరి ఈ కార్డులు కూడా పని చేస్తాయన్నారు. కార్యక్రమంలో DMHO యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.
News December 8, 2025
గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో ఫ్లైట్ రద్దు

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే విజయవాడ-ఢిల్లీ, ఢిల్లీ-VJA ఇండిగో సర్వీసులు సోమవారం రద్దయ్యాయి. మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం చేరుకోవాల్సిన విమానం, 2:50 గంటలకు దిల్లీకి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు టికెట్ ఛార్జీల రీఫండ్ లేదా రీషెడ్యూల్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని ఇండిగో సంస్థ పేర్కొంది.
News December 8, 2025
సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో లొంగిపోయిన మరో నిందితుడు

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో మరో నిందితుడు సోమవారం లొంగిపోయాడు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొమ్మకోట్ల లొంగిపోయాడు. ఇదే కేసులో ఇటీవల తేలప్రోలు రాము, వజ్రా కుమార్ లొంగిపోగా, యుర్రంశెట్టి రామాంజనేయులు అరెస్టయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత వల్లభనేని వంశీ గతంలోనే అరెస్ట్ అయ్యారు.


