News October 7, 2024
నేడు దుర్గమ్మ ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?
దసరా శరన్నవరాత్రులలో ఐదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహా చండీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించనున్నారు. అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటని, చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని పండితులు తెలిపారు. శ్రీ చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలలో ప్రస్తావించబడిందన్నారు.
Similar News
News November 1, 2024
విజయవాడ: తాళం వేసి ఊరెళుతున్నారా? మీకోసమే!
తాళం వేసి ఉన్న ఇంటికి సీసీ కెమెరాలు అమర్చి నిరంతర పోలీసుల పర్యవేక్షణలో ఉండేలా రూపొందించిన “లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం(LHMS)”పై విజయవాడ పోలీసులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సదుపాయం పొందేందుకు LHMS AP Police యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని, వివరాలకు 9440906878 నంబరుకు కాల్ చేయాలని వారు కోరారు. ఈ సేవలలో భాగంగా తాళం వేసి ఉన్న గృహాల భద్రతకై పోలీసులు ఉచితంగా నిఘా కెమెరాను అమర్చుతారన్నారు.
News November 1, 2024
నాగాయలంకలో వింత ఘటన
నాగాయలంక మండలం ఈ కొత్తపాలెం గ్రామంలో మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఓ ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనివ్వడం గ్రామ ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేసింది. కాగా ఈ వింత ఘటన చూడడానికి గ్రామ ప్రజలు బారులు తీరారు. యజమాని మాట్లాడుతూ.. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు.
News November 1, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రయాణికుల సౌలభ్యం మేరకు విశాఖ-విజయవాడ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08567 విశాఖ-విజయవాడ, నం.08568 విజయవాడ-విశాఖ రైళ్లను ఈ నెల 1,3,4,6,8,10,11,13 తేదీలలో 2 వైపులా నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో 10 జనరల్ సెకండ్ క్లాస్, 1 సెకండ్ క్లాస్ కం దివ్యాంగుల కోచ్లు ఉంటాయన్నారు. ఉమ్మడి జిల్లాలో విజయవాడతో పాటు గన్నవరంలో ఈ రైళ్లు ఆగుతాయి.