News May 5, 2024

నేడు ధర్మవరానికి అమిత్ షా, చంద్రబాబు

image

కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు మద్దతుగా ధర్మవరంలో నిర్వహించే బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా, చంద్రబాబు ఆదివారం పాల్గొననున్నారు. ఈ సభకు కూటమి నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చి ధర్మవరం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సత్యకుమార్ పిలుపునిచ్చారు. అటు జాతీయస్థాయిలో మంచిపేరున్న సత్యకుమార్ గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, దేశవ్యాప్తంగా ధర్మవరం పేరు మారుమోగుతుందని బీజేపీ నేతలు తెలిపారు.

Similar News

News November 5, 2024

14న అనంత జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్‌

image

ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్‌ 14న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి మోటార్‌ వాహనాల ప్రమాద కేసులు, సివిల్‌, చెక్‌బౌన్స్‌ కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగిన క్రిమినల్‌ కేసులను జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ చేస్తారని తెలిపారు.

News November 5, 2024

శ్రీ సత్యసాయి: వేరు కాపురం పెట్టలేదని వివాహిత ఆత్మహత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతిలో వివాహిత చైత్ర(25) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. భర్త ప్రేమ్ కుమార్‌తో వేరు కాపురం పెట్టాలని మృతురాలు ఒత్తిడి తెచ్చారు. కొద్ది రోజులు ఆగాలని చెప్పినా వినకుండా క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News November 5, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.30

image

అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.30తో అమ్ముడుపోయినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్‌కు నిన్న 1050 టన్నుల టమాటా దిగుబడులు రాగా కిలో సరాసరి రూ.20, కనిష్ఠ ధర రూ.10 పలికినట్లు చెప్పారు. ఇక చీనీ కాయలు టన్ను గరిష్ఠంగా రూ.30 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి గోవిందు తెలిపారు. కనిష్ఠ రూ.12 వేలు, సరాసరి రూ.22 వేలు పలికిందన్నారు.