News September 26, 2024

నేడు ధర్మవరానికి మంత్రి సత్యకుమార్ యాదవ్

image

మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం ధర్మవరంలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు తాడిమర్రికి మంత్రి చేరుకుని ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 27న ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. 28న పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ, 29న పీటీ కాలనీలో మంత్రి పర్యటిస్తారని తెలిపారు.

Similar News

News October 29, 2025

గుత్తి: తుపాన్ ఎఫెక్ట్ ధర్మవరం – మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు రద్దు

image

మొంథా తుపాన్ ప్రభావంతో ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు సర్వీసును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. MTM – DMM వెళ్లనున్న రైలు సేవలు రద్దయ్యాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. బుధవారం ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (17215)ను కూడా రద్దు చేశామన్నారు.

News October 28, 2025

‘విధులకు హాజరు కాని ముగ్గురు డాక్టర్లకు మెమోలు జారీ’

image

ప్రభుత్వ డాక్టర్లు విధులకు సరిగా హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో దేవి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో సరిగా విధులకు హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. జిల్లాలోని తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహాల్ వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ విధుల్లో లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 28, 2025

అనంత: జిల్లా అధికారులతో సమావేశం

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో షెడ్యుల్డ్ కులాల సంక్షేమం కొరకు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీశ్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ అధ్యక్షులు కుమార్ రాజావర్ల పాల్గొన్నారు. కమిటీ సభ్యులు కావలి గ్రీష్మ, ఎమ్మెస్ రాజు, విజయ్ కుమార్ బిఎన్, రోషన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.