News May 11, 2024

నేడు నంద్యాల, చిత్తూరులో చంద్రబాబు ప్రచారం

image

AP: నేడు చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మ.12.30 నుంచి 1.30 గంటల వరకు నంద్యాల సభలో పాల్గొంటారు. సా.3.30 నుంచి 4.30 గంటల వరకు చిత్తూరులో ప్రచారం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. కాగా, ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.

Similar News

News February 24, 2026

RTC కార్మికులకు గుడ్‌న్యూస్

image

AP: RTC కార్మికులకు EHS కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్సకు అందిస్తున్న ₹2Lకు అదనంగా మరో ₹2L మంజూరు చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ‘EHS కింద ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకూ వైద్యం అందిస్తున్నాం. 1900 డిస్పెన్సరీలు, ఆసుపత్రులలో 45వేల మంది సేవలు పొందుతున్నారు. కార్మికుల పెన్షన్‌కు సంబంధించి సీఎంతో చర్చించి న్యాయం చేస్తాం’ అని మంత్రి వివరించారు.

News February 24, 2026

పిల్లల్లో కిడ్నీ సమస్యలు రాకూడదంటే?

image

పిల్లల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు రాకూడదంటే పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. పిల్లలు ఎక్కువ నీరు తాగేలా చూడటం, ఉప్పు, కారాలు తక్కువగా తీసుకొనేలా చేయడం, యూరిన్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ లేకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అవసరం లేకపోయినా యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వంటి మెడిసిన్స్ వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వాటిని ఎక్కువగా ఇవ్వకండి.

News February 24, 2026

అప్పుడు మిస్ అయింది.. ఇప్పుడు తేలాకే ఎన్నికలకు!

image

TG: BCలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లుకు కేంద్రం ఆమోదం లభించకపోవడంతో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు కుదరలేదు. కానీ ఇప్పుడు ఏదో ఒకటి తేలిన తర్వాతే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశాన్ని మళ్లీ పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత రిజర్వేషన్లపై విపక్షాల అభిప్రాయాలూ తీసుకోనుంది.