News April 10, 2025
నేడు నంద్యాల జిల్లాకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నేడు నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు నిన్న నంద్యాల జిల్లా దొర్నిపాడులో అత్యధికంగా 39.7°C ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.
Similar News
News December 15, 2025
ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా జాగ్రత్తలు తీసుకోండి: కిషన్ రెడ్డి

ఫిలింనగర్లో పర్వతాంజనేయ స్వామి ఆలయాన్ని ఆనుకొని భూములు అన్యాక్రాంతం అయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆలయం చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. ఆదివారం వినాయకనగర్ పర్వతాంజనేయ స్వామి ఆలయంలో పవర్ బోర్వెల్స్ను ఆయన ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
News December 14, 2025
శ్రీకాకుళం: సండే టాప్ న్యూస్ ఇవే

✦యువత ధర్మం పట్ల అవగాహాన పెంచుకోవాలి: ఎమ్మెల్యే మామిడి
✦నరసన్నపేట: డంపింగ్ యార్డులో మళ్లీ చెలరేగిన మంటలు
✦ పితాళినల్లూరులో ఎలుగులు హాల్ చల్
✦గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ
✦టెక్కలి: అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు
✦రణస్థలం: వంతెన కోసం తీసిన గోతిలో పడి బైకర్ మృతి
✦లావేరు: ప్రమాదకరంగా మలుపులు
✦నరసన్నపేట పోలీస్ స్టేషన్కు ఎస్ఐ లేరు
News December 14, 2025
సుస్థిర ఆర్థిక పురోగతిలో ఏపీ: RBI

దేశంలో పలు రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్లు RBI తాజా నివేదిక వెల్లడించింది. ‘1.93 కోట్ల టన్నుల పండ్లు, 51.58 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. FY24-25లో GSDP ₹15.93 లక్షల CRకు చేరగా తలసరి జీఎస్డీపీ ₹2.66 లక్షలుగా నమోదైంది. ఆరోగ్య పరంగా సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. 74 మార్కులతో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో 10వ ప్లేస్లో ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది.


