News April 1, 2025

నేడు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11గం.కు కనగల్ మండలం గంధంవారి ఎడవెల్లి చేరుకొని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు అందించే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రూ.4కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఒంటిగంటకు యాదగిరిగుట్ట చేరుకొని సన్నబియ్యం పంపిణీ, మహిళ సంఘాలకు చెక్కులను పంపిణీ చేస్తారు. 3:30గంటలకు HYD చేరుకుంటారు.

Similar News

News October 24, 2025

NLG: సీసీఐ కొనుగోలు కేంద్రాల వివరాలు!

image

జిల్లా వ్యాప్తంగా ఇవాళ 9 CCI కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రారంభించనున్నారు. ఇందులో సలపార్ కాటన్ మిల్ చండూరు, వరలక్ష్మి కాటన్ మిల్ చిట్యాల, శ్రీలక్ష్మినర్సింహ్మ ఆగ్రో ఇండస్ట్రీ మాల్ ఏ, శివగణేష్ కాటన్ మిల్ మాల్ బీ, శివగణేష్ కాటన్ మల్లేపల్లి ఏ, తిరుమల కాటన్ మిల్ మల్లేపల్లి బీ, శ్రీనాథ్ కాటన్ మిల్ NKL, సత్యనారాయణ కాటన్ మిల్ NLG, TRR కాటన్ మిల్ శాలిగౌరారం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి.

News October 24, 2025

NLG: సర్కార్‌కు ఈసారి రూ.5.77 కోట్ల అదనపు ఆదాయం

image

ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంచినా.. కేవలం 256 దరఖాస్తులు మాత్రమే పెరిగాయి. 2023లో 7,057 దరఖాస్తులు రావడంతో అప్పుడు డిపాజిట్ ఫీజు రూ.2 లక్షలు ఉండగా రూ.141.41 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచినప్పటికీ రూ.147.18 కోట్ల ఆదాయమే సమకూరింది. గతంతో పోలిస్తే ఈసారి సర్కారుకు జిల్లా నుంచి కేవలం రూ.5.77 కోట్ల ఆదాయమే అదనంగా వచ్చింది.

News October 24, 2025

NLG: నవంబర్‌లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

భారత శాస్త్ర సాంకేతిక మండలి న్యూఢిల్లీ, రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నవంబర్ నాలుగో వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో సైన్స్, గణితం, పర్యా వరణ అంశాలపై 114 ఇన్స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించబడతాయని చెప్పారు. పూర్తి వివరాలకు సెల్ 98485 78845 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.