News April 1, 2025
నేడు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11గం.కు కనగల్ మండలం గంధంవారి ఎడవెల్లి చేరుకొని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు అందించే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రూ.4కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఒంటిగంటకు యాదగిరిగుట్ట చేరుకొని సన్నబియ్యం పంపిణీ, మహిళ సంఘాలకు చెక్కులను పంపిణీ చేస్తారు. 3:30గంటలకు HYD చేరుకుంటారు.
Similar News
News April 21, 2025
NLG: డిజిటల్ ఫీడ్ బ్యాక్‌కు కానరాని స్పందన

ఠాణాలకు వచ్చే పౌరులతో పోలీసుల వ్యవహారశైలి, వారందించే సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం సీఐడీ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను అమల్లోకి తెచ్చినా ప్రజల నుంచి స్పందన కానరావడం లేదు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి క్యూఆర్ కోడ్ పట్ల అవగాహన కల్పించకపోవడం వలన ఇది నిరుపయోగంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.
News April 21, 2025
NLG: 22 నుంచి మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే..!

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రెండో విడత సర్వేకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల మొదటి విడత సర్వే పూర్తి చేసిన అధికారులు (ఎల్-1, ఎల్-2, ఎల్-3) కేటగిరీలుగా విభజించారు. ఎల్-1 కేటగిరీ వారికి మొదట ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఎల్-1 కేటగిరీలో ఎక్కువ మంది ఉండడంతో వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు రెండో విడత సర్వే ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.
News April 21, 2025
చిట్యాల: 25 ఏళ్ల తర్వాత అ‘పూర్వ’ కలయిక

చిట్యాల (M) ఉరుమడ్ల ZPHSలో 1998-99 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత దాదాపు 50 మంది ఒకేచోట చేరి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులను సన్మానించారు. వేముల వెంకటేశం, కోనేటి యాదగిరి, పానుగుల్ల నరసింహ, కృష్ణ, యానాల సుధ, చంద్రకళ పాల్గొన్నారు. మీ స్నేహితులతో మీరేప్పుడు ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి.