News April 25, 2024

నేడు నల్గొండకు మాజీ సీఎం KCR

image

మాజీ సీఎం KCR తన బస్సు యాత్రను నల్గొండ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో ర్యాలీలు, రోడ్ షోల్లో KCR పాల్గొనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడకు చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్డు షోలో పాల్గొనున్నారు. రాత్రి సూర్యాపేటలో బస చేస్తారు.

Similar News

News December 13, 2025

22 ఏళ్లకే ఉపసర్పంచ్‌గా ఎన్నిక.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ప్రజాసేవకు!

image

శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామ యువతి బండారి రిషిత (22) అరుదైన ఘనత సాధించారు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించిన ఆమె, గ్రామాభివృద్ధి ధ్యేయంగా కొలువును వదిలారు. ఈమె మంచి మనసును గుర్తించిన గ్రామస్తులు రిషితను తొలి విడత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. యువతకు రిషిత ఆదర్శంగా నిలిచారు.

News December 12, 2025

NLG: స్టేజ్- 2 ఆర్ఓ సస్పెండ్: కలెక్టర్

image

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలైన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన ఘటనలో స్టేజ్- 2 ఆర్‌వో‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

News December 12, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

నార్కట్ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్ఐ
నల్గొండ: జిల్లాలో బ్యాలెట్ పత్రాల కలకలం
నల్గొండ: సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నకిరేకల్: అటవీశాఖ అధికారులకు గుడ్లగూబ అప్పగింత
చండూరు: కస్తాలలో సిపిఐ బలపరిచిన అభ్యర్థి గెలుపు
కట్టంగూర్: వార్షిక వేడుకలకు నిష్కలంక మాత ఆలయం సిద్ధం
శాలిగౌరారం: 22 ఏళ్లకే ఉపసర్పంచిగా ఎన్నిక
నిడమనూరు: విధులు బహిష్కరించిన న్యాయవాదులు