News April 25, 2024
నేడు నల్గొండకు మాజీ సీఎం KCR
మాజీ సీఎం KCR తన బస్సు యాత్రను నల్గొండ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో ర్యాలీలు, రోడ్ షోల్లో KCR పాల్గొనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడకు చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్డు షోలో పాల్గొనున్నారు. రాత్రి సూర్యాపేటలో బస చేస్తారు.
Similar News
News January 20, 2025
ఫిబ్రవరి 2 నుంచి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సిరికొండ నవీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2న NLG పట్టణ పురవీధులలో నగరోత్సవం, ఫిబ్రవరి 4న స్వామివారి కల్యాణోత్సవం, ఈనెల 7న తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News January 20, 2025
NLG: ఆసరా కోసం ఎదురుచూపులు!
ఆసరా పెన్షన్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. సదరం సర్టిఫికెట్లు జారీ చేసి రెండేళ్లు దాటినా ఇంకా తమకు పెన్షన్ రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో సర్టిఫికెట్ గడువు ముగుస్తుందని చెబుతున్నారు. కాగా ఒక్క నల్గొండ మున్సిపాలిటీలోనే పెన్షన్ల కోసం 3 వేలమందికి పైగా అప్లై చేసుకున్నారు. తమకూ పెన్షన్ ఇవ్వాలని సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని లబ్ధిదారులు కోరుతున్నారు.
News January 20, 2025
NLG: ఒక్క యాప్‌తో వివరాలు మీ చేతిలో..
విహారయాత్రలు, దైవదర్శనాల సమాచారం కోసం ప్రభుత్వం మీ టికెట్ యాప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి సాగర్ బోటు ప్రయాణానికి సంబంధించిన వివరాలు, బుద్ధవనం, యాదగిరిగుట్ట ఆలయం, మిర్యాలగూడ చెరువులోని బోటింగ్ వివరాలను ఉంచారు. ఇంకా ఉమ్మడి నల్గొండలో ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చలసోమేశ్వరాలయం, వాడపల్లి, మట్టపల్లి, ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు, పిల్లలమర్రి శివాలయం వివరాలను పొందుపరచాల్సి ఉంది.