News March 1, 2025
నేడు నల్గొండకు రానున్న జాన్‌వేస్లీ

CPM రాష్ట్రకార్యదర్శి కామ్రేడ్ జాన్‌వేస్లీ నేడు నల్గొండకు రానున్నారు. జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ అనంతరం స్థానిక కోమటిరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహించి CPM జాతీయ మహాసభల ముసాయిదా తీర్మానం, రాజకీయ తీర్మానాలపై చర్చ నిర్వహించనున్నట్లు CPM జిల్లా కార్యదర్శి వీరారెడ్డి తెలిపారు. జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, శాఖ కార్యదర్శులు, ఇతర CPM కమిటీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు.
Similar News
News March 1, 2025
టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ!

KMM, WGL, NLG టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, స్వతంత్రంగా పూల రవీందర్, BJP సరోత్తం రెడ్డి, సుందర్‌రాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు ఉండగా.. శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్‌ల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజల్ట్ కోసం మరో 2 రోజులు చూడాల్సిందే.
News March 1, 2025
ఏటేటా తగ్గుతున్న పీఎం కిసాన్ లబ్ధిదారులు!

నల్గొండ జిల్లాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో జిల్లాలో 2,78,667 మంది అర్హులు ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు చనిపోయిన, భూములను అమ్ముకున్న వారిని, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను ఏటా జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీంతో 19వ విడతలో 1,08,651 మంది రైతులకు మాత్రమే అర్హులుగా ఉన్నట్టు తెలుస్తోంది.
News March 1, 2025
మర్రిగూడ: లైంగిక దాడి కేసులో జైలు శిక్ష

బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తికి 16నెలల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి కులకర్ణి విశ్వనాథ్ తీరునిచ్చారు. వివరాలిలా.. మర్రిగూడ మండలం శివన్నగూడెంకి చెందిన నర్సిరెడ్డి 2017లో బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచగా.. 16నెలల శిక్ష, రూ.1500 జరిమానా విధించారు.