News September 8, 2024
నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాకి రానున్నారు. ఉదయం 9:30 గంటలకు మంత్రి పట్టణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Similar News
News October 5, 2024
యాదాద్రి: భార్యను హత్య చేసిన భర్త
మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 5, 2024
నేటి నుంచి నల్గొండలో చేనేత హస్తకళా మేళా
నల్గొండ బోయవాడలో గల ఎస్బీఆర్ గార్డెన్స్‌లో ఈ నెల 5 నుంచి 27 వరకు కళాభారతి చేనేత హస్తకళ మేళా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఇందులో అఖిలభారత హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలంతా ఈ ప్రదర్శనను తిలకించి చేనేతను ఆదరించాలని కోరారు. చేనేత కళాకారులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్త్రాలను అమ్మడం జరుగుతుందని తెలిపారు.
News October 5, 2024
ప్రతి ఇంటిని.. ప్రతి కుటుంబాన్ని కవర్ చేయాలి: కలెక్టర్
పైలెట్ పద్ధతిన నిర్వహిస్తున్న కుటుంబ డిజిటల్ కార్డు సర్వే సందర్భంగా ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని కవర్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సర్వే బృందాలను ఆదేశించారు. గురువారం ప్రారంభమైన కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అయన నల్గొండ మున్సిపల్ పరిధిలోకి వచ్చే 4వ వార్డు పరిధిలో గల కేసరాజుపల్లి హ్యాపీ హోమ్స్ తనిఖీ చేశారు.