News August 2, 2024
నేడు నెల్లూరుకు రానున్న మంత్రి బీసీ
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మంత్రి ఆనంతో పాటు అధికారులతో కలిసి రామాయపట్నం పోర్టును సందర్శిస్తారు. అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటారు. పనుల పరిశీలన అనంతరం విజయవాడ బయలుదేరుతారు.
Similar News
News January 17, 2025
టౌన్ ప్లానింగ్‌లో నూతన సంస్కరణలు అమలు: మంత్రి
దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నూతన సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులుతో కలిసి సమీక్షించారు.
News January 16, 2025
రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది: కాకాణి
రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం పొదలకూరు మండల పరిధిలోని పులికల్లు, నేదురుమల్లి, వెలికంటి పాలెం, శాంతినగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ఇష్టా గోష్టి నిర్వహించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటానని తెలిపారు.
News January 16, 2025
ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్
ఈ నెల 18, 19, 20వ తేదీలలో సూళ్లూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ కోరారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత ఈ పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాలలో ప్రజలందరికి ఈ సమాచారం అందించాలన్నారు. పండుగకు వచ్చే సందర్శకులకు తాగునీరు, టాయిలెట్స్, వైద్య సౌకర్యం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.