News December 23, 2024
నేడు నెల్లూరులో జాబ్ మేళా

నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఇవాళ ఉదయం 9 గ.లకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పలు ప్రముఖకంపెనీ ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు అర్హులు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News November 28, 2025
నెల్లూరులో గూడూరును కలవనీయకుండా అందుకే అడ్డుకున్నారా.?

గూడూరును నెల్లూరులో కలవనీయకుండా ఓ బడా పారిశ్రామికవేత చక్రం తిప్పినట్లు సమాచారం. 3 నియోజకవర్గాల్లో క్వార్ట్జ్, అభ్రకం, మైకా వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి నెల్లూరుకు వెళితే ఖనిజాలపై ‘రెడ్ల’ ఆధిపత్యం పెరుగుతుందని దీనిని అడ్డుకోవడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎన్నికల్లోనూ ఆర్థికంగా ప్రభావం చూపించారట. తిరుపతి గ్రేటర్ పరిధి పెరుగుతన్న క్రమంలో గూడూరును సాంకేతికంగా నెల్లూరులో కలపలేదన్న వాదన కూడా ఉంది.
News November 28, 2025
గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే: జేసీ

మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యం.వెంకటేశ్వర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, కుల వివక్షత నిర్మూలనకై పోరాడారన్నారు.
News November 28, 2025
నెల్లూరులో గూడూరును కలవనీయకుండా అందుకే అడ్డుకున్నారా.?

గూడూరును నెల్లూరులో కలవనీయకుండా ఓ బడా పారిశ్రామికవేత చక్రం తిప్పినట్లు సమాచారం. 3 నియోజకవర్గాల్లో క్వార్జ్, అబ్రకం, మైకా వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి నెల్లూరుకు వెళితే ఖనిజాలపై ‘రెడ్ల’ ఆధిపత్యం పెరుగుతుందని దీనిని అడ్డుకోవడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎన్నికల్లోనూ ఆర్థికంగా ప్రభావం చూపించారట. తిరుపతి గ్రేటర్ పరిధి పెరుగుతన్న క్రమంలో గూడూరును సాంకేతికంగా నెల్లూరులో కలపలేదన్న వాదన కూడా ఉంది.


