News February 1, 2025
నేడు నెల్లూరులో పెన్షన్ల పంపిణీ
నెల్లూరు నగరం వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అదనపు కమిషనర్ నందన్ తెలిపారు. మొదటి రోజు పెన్షన్ 98 శాతం వరకు పంపిణీ జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. 27 మంది సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్లు ఖచ్చితంగా అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 1, 2025
నెల్లూరులో RTC బస్సు టైర్ కింద పడి విద్యార్థి మృతి
నెల్లూరులో BUS కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. కొడవలూరు(M) రేగడిచెలికు చెందిన మహేందర్ నెల్లూరులో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ అనంతరం ఇంటికి వెళ్లేందుకు BUS ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లగానే ప్రయాణికుల కోసం BUS ఆపిన డ్రైవర్ అనంతరం BUSను కదిలించాడు. పుట్పాట్పై ఉన్న మహేందర్ పట్టు తప్పి BUS వెనుక టైర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News February 1, 2025
నెల్లూరులో ప్రారంభమైన పెన్షన్లు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయింది. జిల్లాలోని 3,08,266 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.132కోట్ల అధికారులు ఇవ్వనున్నారు. మరోవైపు మొదటి రోజే దాదాపు 95 శాతం వరకు పెన్షన్ల పంపిణీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద ఉంటూ పెన్షన్ నగదును అందుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
News January 31, 2025
గూడూరు: ‘సారీ.. చైతూ బావ’ అంటూ సూసైడ్
‘చైతూ బావ.. నా కోసం ఏదైనా చేస్తాను అన్నావుగా.. నీకు పుట్టే బిడ్డకు నా పేరు పెట్టు.. నాకు మీరు చూడగానే నచ్చారు. కానీ నా జ్ఞాపకాలు మీతో విడిచి వెళ్లిపోతున్నా.. సారీ..’ అని రాసి ఓ యువతి సూసైడ్ చేసుకుంది. డిసెంబర్ 14న నిశ్చితార్థం కాగా..ఇవాళ బంధువుల అబ్బాయితో పెళ్లి జరగాల్సి ఉంది. ఏం జరిగిందో తెలియదు గానీ గూడూరు సమీపంలోని పంపలేరులో నిన్న మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.