News February 20, 2025

నేడు నెల్లూరులో భారీ ర్యాలీ

image

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తేదీన నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు తెలిపారు. కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదని ఆరోపించారు.

Similar News

News March 13, 2025

మళ్లీ జగన్‌ను CMను చేసుకుందాం: మేకపాటి

image

వైసీపీ అధినేత జగన్.. CMగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలకన్నా అదనపు సంక్షేమ పథకాలు ఇచ్చారని ఆ పార్టీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. 2014-19 వరకు ఐదేళ్ల చంద్రబాబు పాలనను అనుభవించి కూడా మళ్లీ ఆయనకే పట్టం కట్టి ప్రజలు మోసపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ప్రశ్నించాలన్న ఆయన మరోసారి వచ్చే ఎన్నికలల్లో జగన్‌ను CMను చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

News March 13, 2025

పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచుతాం: కాకాణి

image

పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. ‘యువత పోరు’లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసినట్లు ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు ప్రభుత్వం రూ.7,100 కోట్ల బకాయిలు ఉండగా కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచుతాం అని కాకాణి హెచ్చరించారు.

News March 13, 2025

15న కొండబిట్రగుంటకు రానున్న సింగర్ సత్యయామిని

image

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 15 గ్రాండ్‌గా మ్యూజికల్ నైట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ సత్యయామిని సందడి చేయనున్నారు. ఆవిడతోపాటూ జబర్దస్త్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

error: Content is protected !!