News February 20, 2025
నేడు నెల్లూరులో భారీ ర్యాలీ

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తేదీన నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు తెలిపారు. కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదని ఆరోపించారు.
Similar News
News March 19, 2025
నాదెండ్లతో నెల్లూరు నేతల భేటీ

మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్‌లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రులు ఆనం, నారాయణ, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి, సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.
News March 18, 2025
ఏప్రిల్ మూడో వారంలోగా రీ సర్వే పూర్తి: నెల్లూరు జేసీ

జిల్లాలో ఎంపిక చేసిన 35 గ్రామాలలో ఏప్రిల్ మూడో వారంలోగా రీసర్వే పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. మండలంలోని పిడూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేని ఆయన మంగళవారం పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. నోషనల్ ఖాతాలు లేకుండా చూడాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 35 గ్రామాలను రీ సర్వే చేయడానికి పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేశామన్నారు.
News March 18, 2025
వరికుంటపాడు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌తో అనుచిత ప్రవర్తన

వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో BPM గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. పోస్ట్ ఆఫీస్‌లో ఖాతాకు సంబంధించిన మొత్తంలో తేడా ఉందని అతడు అనుచితంగా ప్రవర్తించి మొబైల్ ఫోన్ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.