News July 12, 2024

నేడు పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ CM సమీక్ష

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తాడేపల్లిలోని పంచాయితీ రాజ్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, తాడేపల్లిలోని పంచాయితీ రాజ్ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పవన్ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తొలిసారి ఈ సమావేశం జరగనుంది.

Similar News

News December 7, 2025

మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

image

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు (D) తాడేపల్లి (M) చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ.2 కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు ఆమె 90వ జయంతి సందర్భంగా బాలశౌరి తెలిపారు.

News December 6, 2025

దాతలు సమాజానికి నిజమైన స్ఫూర్తిప్రదాతలు: కలెక్టర్

image

విదేశాల్లో స్థిరపడి మాతృభూమిపై మమకారంతో ప్రజాసేవకు ముందుకొస్తున్న దాతలు నిజమైన స్ఫూర్తిప్రదాతలు అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం జీజీహెచ్‌లో ఆల్ ఫ్రెస్కో యాంపీ థియేటర్ ఆమె ప్రారంభించారు. సమాజ అభివృద్ధిలో దాతలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని సైతం అమలు చేస్తుందని తెలిపారు. జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 6, 2025

GNT: వైసీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా సిరిబోయిన

image

వైసీపీ బీసీ సెల్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా సిరిబోయిన అవినాశ్ నియమితులయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం అదిష్ఠానం తనను ఉపాధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా తనకు పదవి రావడానికి కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.