News October 1, 2024
నేడు పత్తికొండకు CM చంద్రబాబు

కర్నూలు (D) పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉ.11:40 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 12:30కు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ఏ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 12:40 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:05 నిమిషాలకు పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకుంటారు. అనంతరం గ్రామంలో పింఛన్ పంపిణీ చేస్తారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News January 3, 2026
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: డీఐజీ

రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రతీ శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, కర్నూలు ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
News January 3, 2026
కర్నూలు జిల్లాలో 78 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కర్నూలు జిల్లాలోని KGBVల్లో 78 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 56, టైప్-4 కేజీబీవీల్లో 22 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: నేటి నుంచి జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.
News January 3, 2026
జాతీయ ఆర్చరీలో కర్నూలుకు స్వర్ణ కాంతులు

హైదరాబాద్లో జరిగిన 5వ జాతీయ స్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో కర్నూలు క్రీడాకారులు సత్తా చాటారు. ఏపీ జట్టు తరఫున పాల్గొన్న 30 మంది క్రీడాకారులు 7 బంగారు, 6 వెండి, 10 కాంస్య పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించడం గొప్ప విషయమని, అందులో కర్నూలు క్రీడాకారులు ఉండటం గర్వకారణమని డీఐజీ/కర్నూలు ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. క్రీడాకారులను ఆయన అభినందించారు.


