News October 26, 2024

నేడు పద్మశ్రీ గుస్సాడి కనకరాజు అంత్యక్రియలు

image

ఆసిఫాబాద్: పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు అంత్యక్రియలు నేడు స్వగ్రామం జైనూర్ మండలం మర్లవాయిలో జరగనున్నాయి. శుక్రవారం అనారోగ్యంతో ఆయన కన్నుమూయగా.. పలువురు సంతాపం తెలిపారు. ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అలరించే ఆయన ఈసారి పండగ ముందే కన్నుమూయడంతో ఆదివాసీ గూడేల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి వన్నెతెచ్చిన కనగరాజును 2021లో ‘పద్మశ్రీ’ వరించింది.

Similar News

News December 4, 2025

KCR కుటుంబంలో పైసల పంచాయితీ: సీఎం

image

ప్రజల సొమ్ము తిన్న వారు ఎవరు బాగుపడరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలు అడ్డగోలుగా సంపాదించిన BRS పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ఇప్పుడు KCR కుటుంబంలో పైసల పంచాయితీ నడుస్తుందని ఎద్దేవా చేశారు. కొడుకు KTR ఒకవైపు, బిడ్డ కవిత మరో వైపు, KCR ఫామ్ హౌస్‌లో ఉన్నారని విమర్శించారు.

News December 4, 2025

ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి: CM

image

ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవార ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చేవి కావని గుర్తు చేశారు. సచివాలయానికి రానివ్వకుండా తనను, మంత్రి సీతక్కను అడ్డుకున్నారని తెలిపారు.

News December 4, 2025

ADB: ‘సైనికుల సహాయార్థం విరాళాలు అందించాలి’

image

దేశ రక్షణకు సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సైనిక పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న ఎన్‌సీసీ క్యాడెట్లు జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరిస్తారన్నారు. తోచిన విరాళాలు అందించి, దేశ రక్షణకు శ్రమిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు.