News October 5, 2024

నేడు పార్టీ అధిష్ఠానం వద్దకు కొలికపూడి

image

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పలువురు చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆయన్ను వివరణ కోరనుంది. ఇదే సమయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు శావల దేవదత్‌‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలికపూడిని ఇవాళ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని అధిష్ఠానం ఆదేశించింది.

Similar News

News December 8, 2025

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో లొంగిపోయిన మరో నిందితుడు

image

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో మరో నిందితుడు సోమవారం లొంగిపోయాడు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొమ్మకోట్ల లొంగిపోయాడు. ఇదే కేసులో ఇటీవల తేలప్రోలు రాము, వజ్రా కుమార్ లొంగిపోగా, యుర్రంశెట్టి రామాంజనేయులు అరెస్టయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత వల్లభనేని వంశీ గతంలోనే అరెస్ట్ అయ్యారు.

News December 8, 2025

1.82లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం: జేసీ నవీన్

image

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి 29,866 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.502.50 కోట్లు చెల్లించామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోపే చెల్లింపులు చేస్తున్నామన్నారు. 72,98,622 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

News December 7, 2025

కృష్ణా: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..!

image

తండ్రికి కూతురు తలకొరివి ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఏడుకొండలు (56) అనారోగ్యంతో మరణించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, మూడవ కుమార్తె కళ్యాణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఆమె తన తండ్రికి తలకొరివి పెట్టన దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.