News August 22, 2024
నేడు పీఆర్ డైరెక్టర్ కృష్ణతేజ పర్యటన

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ వీఆర్. కృష్ణతేజ గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తొలుత టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో చేపట్టిన ఫీడర్ ఛానల్ పనుల పరిశీలిస్తారు. ఉపాధి హామీ కూలీలతో సమావేశమవుతారు. అనంతరం జయవరం గ్రామంలోని ఉద్యాన పండ్ల తోటల సాగును పరిశీలించి రైతులతో మాట్లాడతారు.
Similar News
News December 9, 2025
ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
News December 9, 2025
ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
News December 9, 2025
ప్రకాశం: రేపటి నుంచి టెట్ పరీక్షలు..!

ప్రకాశం జిల్లాలో ఈనెల 10 నుంచి 21 వరకు జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో టెట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నట్లు, 8 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.


